భలే ఆఫర్ : రూ.999 EMIకే ల్యాప్‌టాప్‌

hp laptopవిద్యార్థులు, తొలిసారి పర్సనల్‌ కంప్యూటర్స్‌ కొనుగోలు చేసేవారికి నెలవారీ రూ. 999 EMIకే ల్యాప్‌టాప్‌ అందిస్తోంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌. ఇందుకోసం హెచ్‌పీ, ఇంటెల్, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజాల సహకారంతో ఈ ఆఫర్ ప్రకటించింది ఫ్లిప్‌కార్ట్‌. ఈ ఆఫర్‌ కింద రూ. 36,000 ఖరీదు చేసే హెచ్‌పీ ఇంటెల్‌ కోర్‌ ఐ3 విండోస్‌ 10 ల్యాప్‌టాప్‌ను 36 నెలల సులభ వాయిదా పద్ధతిలో అందిస్తున్నట్లు తెలిపింది. ఫైనాన్సింగ్‌ సదుపాయం కల్పించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్, సిటీబ్యాంక్‌లతో టైఅప్‌ పెట్టుకున్నట్లు వివరించింది ఫ్లిప్‌కార్ట్‌. అత్యధికంగా అమ్ముడయ్యే ఉత్పత్తుల్లో ఫ్లిప్‌కార్ట్‌ ల్యాప్‌టాప్‌లు మూడో స్థానంలో ఉన్నాయి.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy