భలే ఉంది : ITకి మోడీ కొత్త నిర్వచనం

Modiఐటీ రంగంపై మోడీ సంచలన వాఖ్యలు.. ప్రజలు టెక్నాలజీని తమ జాగ్రత్తగా గుప్పెట్లో పెట్టుకోవాలన్నారు. అనవసరంగా టెక్నాలజీ వినియోగించే మైండ్ సెట్ ను ప్రజలు మానుకోవాలన్నారు మోడీ. కొంతమంది మాత్రమే ఆసక్తి చూపితే సరిపోదనీ.. పెద్ద ఎత్తున దీనిపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎవరూ ఊహించని విధంగా IT+IT=IT.. (Information Technology + Indian Talent = India Tomorrow) అనే ఈక్వేషన్ ను చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ + ఇండియన్ టాలెంట్ = ఇండియా టుమారోగా భారతదేశం మైండ్ సెట్ మారకపోతే.. టెక్నాలజీలో ఎన్ని మార్పులు తెచ్చినా.. ప్రజల్లో ఎటువంటి మార్పురాదని స్పష్టం చేశారు. టెక్నాలజీని ఫాషన్ లా కాకుండా దేశ ఎదుగుదల కోసం కలిసిగట్టుగా పాటిస్తే సమాజానికి మంచి జరుగుతుందన్నారు. పాత పద్దతులకు స్వస్తి చెప్పి పేపర్ వినియోగాన్ని తగ్గించి.. ఆన్ లైన్ ఈ గవర్నెన్స్ సేవలను ఉపయోగించుకోవాలన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీపై ఫోకస్ చేసి.. పేదలకు ఈ విద్య చేరేలా ఉద్యమం చేపట్టాలన్నారు. పెండింగ్ లో ఉన్న కేసులకు ఇప్పటికైనా తగ్గించమని CJI మీటింగ్ లో పేర్కొన్నారు ప్రధాని మోడీ.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy