భలే చౌకబేరం : ఐ ఫోన్లపై భారీ డిస్కొంట్స్

iphoneఎలక్ట్రానిక్ గూడ్స్ పై భారీ డిస్కొంట్స్ ప్రకటించింది యాపిల్. ఐఫోన్లు, ఐపాడ్లపై ప్రేమికుల దినోత్సవం సందర్భంగా భారీ ఆఫర్స్ ఇచ్చింది.

ఐఫోన్లపై డిస్కొంట్స్ ఇలా :

ఐఫోన్ SEపై రూ.7వేల క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇది కేవలం HDFC డెబిట్, క్రెడిట్ కార్డులపై మాత్రమే కొనుగోలు చేయాలి. అది కూడా EMI రూపంలోనే వర్తిస్తుంది. ప్రస్తుతం ఐఫోన్ SE (32GB) రూ.22వేలుగా ఉంది మార్కెట్ లో. ఈ ఆఫర్ ద్వారా రూ.7వేల క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే రూ.15వేల ఐఫోన్ SE లభిస్తుంది. ఐఫోన్ 6పైనా ఇదే విధమైన ఆఫర్ ఇస్తోంది. దీంతో ఇప్పుడు ఈ ఫోన్ రూ.20వేలకే లభిస్తోంది.

ఐపాడ్స్ పై భారీ ఆఫర్స్ :

యాపిల్ ఐపాడ్, ఐపాడ్ మినీ 4, ఐపాడ్ ప్రోపై రూ.10వేల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఇది EMI ఆప్షన్ కింద వర్తిస్తుంది. దీంతోపాటు ఐపాడ్ 9.7ఇంచ్ వై-ఫై మోడల్ పై అత్యంత తగ్గింపు ఇస్తోంది. రూ.25వేలు ఉన్న ఈ మోడల్ ఐపాడ్ ను.. కేవలం రూ.15వేలకు మాత్రమే ప్రస్తుతం లభిస్తోంది.

ఐఫోన్ షోరూమ్స్, ప్రముఖ మొబైల్ షాపుల్లో HDFC డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ డిస్కొంట్స్ ఉంటాయి. ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని యాపిల్ కంపెనీ ప్రకటించింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy