భల్లాలదేవ రథానికి ఎన్‌ఫీల్డ్ ఇంజన్

ballaభల్లాలదేవ ఎన్ ఫీల్డ్ .. ఉపయోగించడం ఏంటి? అనుకుంటున్నారా.. నిజమే.. ఈ సినిమాలో భల్లాలదేవ రథానికి ఎన్ ఫీల్డ్ ఇంజిన్ ఉపయోగించారట. ఈ సినిమా ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్పారు. దాని శక్తితోనే కావల్సినంత వేగంగా భల్లాలదేవ రథం వెళ్లిందన్నారు. ఈ రథాన్ని పూర్తిగా సాబు సిరిల్, ఆయన బృందమే తయారుచేసింది. అంతేకాదు.. రథం ముందు భాగంలో ఒక కారు స్టీరింగ్, దానికి ఒక డ్రైవర్ కూడా ఉన్నారట. ఆ డ్రైవరే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంజన్‌తో కూడిన రథాన్ని నడిపిస్తుంటారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంజన్లు సులభంగా ఎక్కడైనా బిగించే అవకాశం ఉండటం, దానికితోడు మంచి వేగంగా తీసుకెళ్లగలిగే శక్తి ఉండటంతో దాన్నే ఈ రథానికి ఉపయోగించుకున్నారు. 350 లేదా 500 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్‌ను ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy