భవిష్యత్తులో బర్రెల పంపిణీ : తలసాని

tlasaniభారతదేశంలోనే ఏ రాష్ట్రం చేయలేని విధంగా ..మంచి ఉద్దేశ్యంతో  గొర్ల పంపిణీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. మంగళవారం (మార్చి-13)న జరిగిన అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన తలసాని..  పశుగ్రాసం విషయంలో సమ్మర్ లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటుచేస్తున్నామన్నారు.

గొర్రెలు ఇచ్చి వదిలిపెట్టడమే కాకుండా.. వాటికి కావాల్సిన పశుగ్రాసానికి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందన్నారు. సంచార పశు వైద్యశాలలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ వైద్యశాలలు గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఉపయోగపడుతున్నాయని తెలిపారు. భవిష్యత్‌లో బర్రెల పంపిణీ కార్యక్రమం అమలుకు ఆలోచిస్తామన్నారు. తెలంగాణ ప్రజలు.. దేశంలోనే గొప్పగా బతకాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు మంత్రి తలసాని.

పాడిపరిశ్రమకు మొబైల్ వెహికిల్స్ ఉపయోగపడుతున్నాయన్నారు. గ్రామాలల్లో పశువులకు చికిత్స ఉస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ గొల్లకుర్మలు తలెత్తుకుని బతుకుతున్నారన్నారు. పేద వర్గాలు, కుల వృత్తులవారికి తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను తీసుకువస్తుందని తెలిపిన తలసాని..  మత్య్స పరిశ్రమ కోసం చేపలను పంపిణీ చేశామన్నారు.  రైతులు తలెత్తుకుని బ్రతకాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు తలసాని.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy