భవిష్యత్ తరాల పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి: కేసీఆర్

kcr kitప్రసవం సమయంలో ఆర్థిక సాయం చేసేది, అప్పుడే పుట్టిన పిల్లలకు కేసీఆర్ కిట్లు బహుమతిగ ఇచ్చేది.. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకే అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రంలో ప్రసవ మరణాలు సున్నా శాతానికి పడిపోవాలని, రాబోయే తరం పిల్లలు చాలా ఆరోగ్యంగా పెరగాలని కోరారు. సర్కార్ ఆస్పత్రుల్లో.. పురుడుపోసుకునే పేద మహిళలకిచ్చే 12వేల నగదు సాయం, పిల్లలకిచ్చే కేసీఆర్ కిట్.. పథకాల అమలు ఎలా ఉండాలనే  విషయంపై.. ప్రగతి భవన్లో సమీక్ష చేశారు ముఖ్యమంత్రి. పిల్లలకు ఇచ్చే కేసీఆర్ కిట్లను పరిశీలించారు. మస్కిటో మెష్, సబ్బులు, షాంపూలు, పౌడర్లు, టవళ్లు, డైపర్లను చూసి బాగున్నాయన్నారు కేసీఆర్.

కేసీఆర్ కిట్లకు ఇప్పటికే టెండర్లు పిలిచామని మే నెల నుంచి ఇస్తామని చెప్పారు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనరు వాకాటి కరుణ. ఈ మీటింగులోనే.. 12వేల సాయం, కేసీఆర్ కిట్లు, అమ్మఒడి కార్యక్రమాల అమలుకు సంబంధించి కార్యాచరణ రూపొందించేందుకు.. మహిళా ఆఫీసర్లతో కమిటీ నియమించారు సీఎం. కమిటీలో శాంతికుమారి, వాకాటి కరుణ, స్మిత సభర్వాల్, యోగితారాణి, ప్రియాంక వర్గీస్ సభ్యులుగ ఉంటారు.

నెలలు నిండిన నాటి నుంచే.. పురుడుపోస్కోని.. బిడ్డకు రెండు మూడు నెలల వయస్సొచ్చే వరకు ఇళ్లు గడిచేలా ఉండాలని ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. సర్కార్ దవాఖానల్లో కాన్పు అయిన వారందరికి 12వేల చొప్పున ఇస్తామన్నారు. ఆడపిల్ల పుడితె మరో రూ.1000 అదనంగా ఇస్తామని  చెప్పారు సీఎం. ఈ సాయం ఎన్ని విడుతల్లో ఇవ్వాలో… గర్భిణీకు ఏ నెల నుంచి  డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టాలో ఆఫీసర్లే తేల్చాలని చెప్పారు కేసీఆర్. ఇక ఊర్లల్లో గర్భిణీల పేర్లు రాసుకోవాలని..వారికి క్రమం తప్పకుండ పరీక్షలు చేయించి, మందులివ్వాలని చెప్పారు సీఎం.ఊర్లలో ఉన్న ANMలు, అంగన్ వాడీ టీచర్లు, ఆశా వర్కర్లల్ల.. ఈ పనులకు ఎవరిని ఉపయోగిస్తే బాగుంటుందో నిర్ణయించాలన్నడు.

ఇక ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయల భృతి ఇవ్వాలని నిర్ణయించామన్నారు సీఎం. ఒంటరి మహిళలను గుర్తించాలని ఆఫీసర్లను ఆదేశించారు సీఎం. ఒంటరి మహిళలకు ఆర్థిక సాయం అందడం వల్ల వాళ్లకే కాకుండా.. ఇన్నాళ్లు వాళ్లను పోషిస్తున్నవారికి కూడ ఊరట కల్గుతుందన్నారు సీఎం కేసీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy