భవిష్యనిధిపై 8.5% వడ్డీరేటు

epfo భవిష్యనిధి(PF) ఖాతాలపై 2017-18 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.55% వడ్డీ రేటును అందజేయాలని తమ ఫీల్డ్‌ కార్యాలయాలను ఆదేశించింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO). వడ్డీరేటును కేంద్రం ఆమోదించినట్లు కేంద్ర కార్మికశాఖ సమాచారమిచ్చిందని పేర్కొంది. 8.55% వడ్డీ రేటుకు కేంద్ర ఆర్థికశాఖ ఇదివరకే అంగీకారం తెలిపినప్పటికీ.. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో దీన్ని  అమలు చేయలేకపోయమంది ఈపీఎఫ్‌ఓ. ఫిబ్రవరిలో జరిగిన ఈపీఎఫ్‌ఓ కేంద్ర ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ వడ్డీరేటును నిర్ణయించారు. గత ఐదేళ్లలో ఈపీఎఫ్‌ఓ అందించిన వడ్డీ రేట్లలో ఇదే అతి తక్కువ.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy