భాంగ్రాతో మురిపించిన కెనడా పీఎం

65000895-Canada-PM_6కెనెడా ప్రధాని జస్టిన్ ట్రూడ్యూ అదిరిపోయే స్టెప్పులతో అలరించారు. అమ్మాయిలతో కలిసి భాంగ్రా స్టెప్పులేసి.. స్థానిక భారతీయుల మనసులు దోచుకున్నారు. ఇప్పుడది సోషల్ సైట్లలో వైరల్ అయ్యింది. అయితే ఆ వీడియో ఇప్పటిది కాదులెండి. ఆయన ప్రధాని కాకముందు. మూడేళ్ల క్రితం ఇండియా 66వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కెనడా మాంట్రియల్ లో… ఇండో-కెనడా అసోసియేషన్ సదస్సు జరిగింది. ఆ సదస్సులో ఈ స్టెప్పులేశారు జస్టిన్. మైకాసింగ్ పాడిన ‘దిల్ బోలే హడిప్పా’ పాటకు డ్యాన్సు చేశారు. స్టేజ్ పై డాన్స్ చేస్తున్న అమ్మాయిల జోష్ ని చూసి వారితో పాదం కలిపారు. ఆ వీడియో ఇపుడు లీక్ అయింది. కొన్ని రోజుల క్రితం జస్టిన్ ట్యూడ్యూ కెనెడా ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ వీడియోతో భారతీయుల మనసు గెలుచుకున్నారాయన.

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy