భాగ్యనగరం వేదికగా అతిపెద్ద హ్యాకథాన్

దేశంలోనే అతిపెద్ద హ్యాకథాన్ కు  భాగ్యనగరం వేదిక కానుంది.  తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్(టీటా) ఆధ్వర్యంలో డిజిథాన్,పిక్సెల్ కంపెనీ కలిసి నిర్వహిస్తున్న ఈ హ్యాకథాన్ కు నాసా,తెలంగాణ ప్రభుత్వం,జెఎన్ టియు,మైక్రోసాఫ్ట్,ఐబిఎం,గూగుల్,ఫైర్ ఫాక్స్ సంస్థలు సపోర్ట్ చేస్తున్నాయి. అక్టోబర్ 5 నుంచి 7 తేదీల్లో హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వివిధ వేదికల్లో ఒకేసారి 10,000 మంది ఈ హ్యాకథాన్ లో పాల్గొననున్నారు.  హ్యాకథాన్ లోగోను నిన్న(సెప్టెంబర్.24న) తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ పోటీలకు ఎంట్రీ ఫ్రీ అని నిర్వాహకులు తెలిపారు.    అక్టోబర్ 19 నుంచి 21 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో బెస్ట్ గా నిలిచిన 3 ప్రాజెక్టులను నాసా గ్లోబల్ నామినేషన్స్ కు పంపనున్నారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy