భారతీయులకు షాకింగ్ : స్విస్ బ్యాంకుల్లో మనోళ్ల నల్లధనం పెరిగింది

swis-fbనల్లధనాన్ని అరికట్టడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అవి ఫలించట్లేదు. స్విస్ బ్యాంకుల్లో పెరిగిపోతున్న భారతీయుల నల్లధనాన్ని చూస్తే భారత ప్రజలు షాక్ కు గురవ్వాల్సిందే. అకౌంట్లో మనీ పెంచుకోవడమే తప్ప, తగ్గించుకునే పనే లేదంటున్నారు బ్లాక్ మనీ హోల్డర్స్. ఏ చట్టాలు మమ్మల్ని ఏం చేయలేవంటూ నల్లధనాన్ని ఈజీగా దేశం దాటించి సేఫ్ స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చని ఏం చేయదులే అన్న ధీమా బ్లాక్ మనీ హోల్డర్స్ లో పెరిగిపోయినట్లు కన్పిస్తుంది. నోట్ల రద్దు తర్వాతే స్విస్ బ్యాంకుల్లో నల్లధనం 56 శాతం పెరిగిపోయింది. 2017 లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం 7వేల కోట్లు పెరిగింది. స్విస్ బ్యాంకుల్లో అన్నీ దేశాల వ్యక్తులకు చెందిన డబ్బు 2017 లో 3 శాతం పెరిగి 100 లక్షల కోట్లుగా ఉందని స్విస్ నేషనల్ బ్యాంక్(SNB) గురువారం(జూన్-28) విడుదల చేసిన యాన్యువల్ డేటా తెలిపింది. 1987 నుంచి స్విట్జర్లాండ్… బ్యాంకుల్లో మనీ వివరాలను ప్రజల ముందు ఉంచుతుంది.

ఈ రోజు స్విస్ నేషనల్ బ్యాంక్ విడదల చేసిన యాన్యువల్ డేటా వివరాల ప్రకారం… మూడేళ్లుగా స్విస్ బ్యాంకుల్లో తగ్గుతూ వస్తున్న భారతీయుల బ్లాక్ మనీ  2017 లో భారీగా 56 శాతం పెరిగింది. 2016లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల మనీ 45 శాతం తగ్గిపోయింది. 2006 చివరి నాటికే స్విస్ బ్యాంకుల్లో భారతీయుల మనీ రికార్డు స్ధాయిలో 23 వేల కోట్లు ఉంది. సుప్రీం కోర్టు సూచనతో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల నల్లధనం కేసుని ఛేధించడానికి ప్రభుత్వం ఓ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy