భారతీయుల చెమట, రక్తంతో తాజ్ మహల్: సీఎం యోగి

yogiతాజ్ మహల్ భారతీయుల రక్తం, చెమట చుక్కలతో కట్టిందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. తాజ్ పై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల సందర్భంగా ఆయన స్పందించారు. తాజ్‌మహల్‌ను ఎవరు, ఏ కారణం కోసం కట్టించారన్నది అనవసరమన్నారు. అయితే అది మన భారతీయ కార్మికుల రక్తం, చెమటతోనే నిర్మించారని.. ఈ నెల 26న తాజ్‌మహల్ సందర్శనకు తాను వెళ్తున్నట్లు చెప్పారు. పర్యాటక కోణంలో చూస్తే ఇది తమకు చాలా ముఖ్యమైనదని, ఇక్కడికి వచ్చే టూరిస్టులకు తగిన వసతులు, భద్రత కల్పించడం తమ బాధ్యత అని యోగి అన్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy