భారతీయ నారీ జిందాబాద్ : వంద కోట్ల మనసులు గెలిచారు

teamఒకే ఒక్క మ్యాచ్ టీమిండియా మహిళా క్రికెట్ విప్లవానికి నాంది పలికింది. మ్యాచ్ గెలిస్తే చరిత్ర తిరగరాస్తారని అందరూ భావించారు.. కానీ ఓడినా 100 కోట్ల మంది భారతీయు మనసులు గెలిచారు. మహిళా క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ లో చివరి వరకు పోరాడి.. కేవలం తొమ్మిది పరుగుల తేడా ఓడిన టీమిండియా సోషల్ మీడియా బ్రహ్మరథం పడుతోంది. సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఫేస్ బుక్, ట్విట్టర్లలో అభినందలు చెబుతోంది. మ్యాచ్ ఓడినా కూడా టీమిండియా మహిళా జట్టుకు ట్విట్టర్ వేదికగా లక్షల సంఖ్యలో శుభాకాంక్షలు చెప్పటంతోపాటు.. వారు స్పందించిన తీరు.. చేసిన కామెంట్స్ కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి.

కొన్న అద్భుతమైన కామెంట్స్ ఇలా ఉన్నాయి :

… కప్ ది ఏముందీ రేపు వస్తుంది.. ఇలాంటి స్ఫూర్తి మళ్లీ వస్తుందా..

… ఈ ఓటమిని మేం గర్వంగా ఆహ్వానిస్తున్నాం.. దీంతో మాజట్టు మరింత దృఢంగా తయారైంది

… మీరు కప్ మాత్రమే ఓడిపోయారు.. 100 కోట్ల మంది భారతీయుల మనసులు గెలిచారు. ఇంత కంటే ఏం కావాలి మిథాలీ

… గ్రౌండ్ లో మీ పోరాటానికి ఫిదా అయ్యాం.. మీ ఆటతో భారతీయ మహిళా క్రికెట్ స్వరూపాన్నే మార్చేశారు.. వెల్ డన్

… భారతదేశంలో ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకం అయ్యారు.. భారతీయ మహిళా శక్తిని ప్రపంచానికి చాటారు. ఆటలో గెలుపు ఓటములు సహజం..

… భారతీయ నారీ జిందాబాద్. మీరు ఓడినా మేం పండగ చేసుకుంటున్నాం.

… మీ ఆటతీరు చూసిన తర్వాత ఎంతో గర్వంగా ఫీలవుతున్నాం.

… ఈ మహిళలు విప్లవాన్ని ప్రారంభించారు. ఓటమిలోనూ గెలిచిన వీరనారీలు

… మీ అంకితభావానికి, బలమైన ఆకాంక్షకు సెల్యూట్. మా మనసులు గెలిచారు.

… ఏం పర్లేదు.. గర్వించాల్సిన సమయం. మహిళా శక్తిని చాటారు.

.. గొప్పగా ఆడారు. మీ ప్రయాణం నమ్మశక్యం కానిది. మీ స్ఫూర్తి యావత్ భారత్ ఉంటుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy