భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ లు : షెడ్యూల్ ఇదే

IND- AUS TOURIPL మ్యాచ్ లతో జోరుమీదున్న భారత ప్లేయర్లు ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లతో బిజీ కానున్నారు.  IPL తర్వాత టీమిండియా వన్డే, టీ20, టెస్టు సిరీస్‌ లు ఆడేందుకు ఇంగ్లాండ్‌ వెళ్లనున్న విషయం తెలిసిందే. జులైలో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే సోమవారం (ఏప్రిల్-30) క్రికెట్‌ ఆస్ట్రేలియా 2018-19కి సంబంధించి ఆసీస్‌ ఆడే క్రికెట్‌ మ్యాచ్‌ల వివరాలను వెల్లడించింది.

2018 నవంబరు 21 నుంచి 2019 జనవరి 18 వరకు భారత్‌-ఆసీస్‌ మధ్య టీ20, టెస్టు, వన్డే సిరీస్‌ లు జరగనున్నట్లు తెలిపింది.  ఈ టూర్ లో భారత్‌.. ఆసీస్‌ తో మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. టూర్ లో టీ20 సిరీస్‌ తో భారత్‌ తన పర్యటనను ప్రారంభించనుంది.

షెడ్యూల్‌:

ఫస్ట్ టీ20: నవంబరు 21- గబ్బా

రెండో టీ20: నవంబరు 23- మెల్‌బోర్న్‌

మూడో టీ20: నవంబరు 25- సిడ్నీ

మొదటి టెస్టు: డిసెంబరు 6 – ఆడిలైట్‌

రెండో టెస్టు: డిసెంబరు 14 – పెర్త్‌

మూడో టెస్టు: డిసెంబరు 26 – మెల్‌బోర్న్‌(బాక్సింగ్‌ డే టెస్టు)

నాలుగో టెస్టు: జనవరి 3- సిడ్నీ

మొదటి వన్డే: జనవరి 12- సిడ్నీ

రెండో వన్డే: జనవరి 15- ఆడిలైట్‌

మూడో వన్డే: జనవరి 18- మెల్‌బోర్న్‌

ఈ మూడు సిరీస్‌ల్లో ఆసీస్‌ ఆటగాళ్లు స్మిత్‌, వార్నర్‌ ఆడలేరు. బాల్‌ టాంపరింగ్‌ వివాదం కారణంగా వీరిద్దరిపై విధించిన 12 నెలల నిషేధం 2019 మార్చిలో ముగియనుంది. దీంతో వీరు ఈ సిరీస్‌ కు దూరం కానున్నారు. ఇదే వివాదంలో 9 నెలల నిషేధం ఎదుర్కొంటున్న బాన్‌ క్రాఫ్ట్‌ భారత్‌ తో వన్డే సిరీస్‌ కు అందుబాటులో ఉండనున్నాడు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy