భారత్ కొత్త మిసైల్స్ : చైనా మొత్తం టార్గెట్

missile-man“భారత్ ఆయుధాలకు పదునుపెడుతోంది. చైనాను టార్గెట్ చేసే విధంగా.. కొత్త మిసైల్స్ ను తయారు చేస్తోంది. ఈ మిసైల్స్ చైనా దేశం మొత్తాన్ని టార్గెట్ చేస్తాయి.. ఈ మాటలంటోంది ఎవరో కాదు.. అగ్రరాజ్యం అమెరికా సైంటిస్టులు. సిక్కిం విషయంలో ఇప్పటికే డిష్యుం.. డిష్యుం అన్నట్టుగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ వార్త మరింత సంచలనమైంది. అమెరికాకు చెందిన ఇద్దరు న్యూక్లియర్ సైంటిస్టుల రాసిన పరిశోధనాత్మక వ్యాసం చర్చనీయాంశమైంది.

భారత్ తన అణుశక్తిని మరింత పెంచుకుంటోందని చెబుతున్నారు ఆ న్యూక్లియర్ ఎక్స్ పర్ట్స్. ఇండియన్ న్యూక్లియర్ ఫోర్సెస్ – 2017 అనే ఆర్టికల్ లో భారత అణుశక్తి గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు హన్స్ ఎంకిర్ స్టెన్సన్, రాబర్ట్ ఎస్ నోరీస్. ఇప్పటి వరకు పాకిస్తాన్ కోణంలో ఆయుధాలు తయారీ విధానం ఉంటే.. ఇప్పుడది చైనా లక్ష్యంగా.. అత్యంత శక్తివంతగా ఉందంటున్నారు ఆ సైంటిస్టులు. వాటర్ హెడ్స్ తయారు చేస్తోందని తెలిపారు. మిస్సైల్ తయారీకి ఉపయోగించే ప్లూటోనియం 600 కేజీలపైనే ఉందని చెబుతున్నారు. దీంతో మొత్తం 150 – 200 వరకు తయారు చేయొచ్చని.. అయితే 120-130 వరకు మాత్రమే తయారు చేసిందని తెలిపారు. మరోవైపు అగ్ని-4 ను మరింత అభివృద్ధి చేసి 5వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా అగ్ని-5ను తయారు చేస్తున్నట్టు ఈ కథనం సారాంశం.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy