భారత్ చేతిలో పాక్ చిత్తు

hockey-indహాకీలో మరోసారి పాకిస్థాన్ ను చిత్తు చేసింది భారత్. వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌లో 6-1 గోల్స్‌ భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. వరల్డ్‌ హాకీ లీగ్‌లో 5-8 క్లాసిఫికేషన్‌ గేమ్‌లో గెలిచిన భారత్‌ తదుపరి మ్యాచ్‌లో కెనడాను ఎదుర్కోనుంది. ఐదు లేదా ఆరో స్థానాల కోసం ఈ మ్యాచ్‌ జరగనుంది. గడిచిన వారం రోజుల్లో దాయాది పాక్‌పై భారత్‌కు ఇది రెండో విజయం కావడం గమనార్హం. వరల్డ్‌ హాకీ లీగ్‌లో భాగంగా ఇంతకుముందు జరిగిన మ్యాచ్‌లోనూ 7-1 గోల్స్‌ తేడాతో పాక్‌ను భారత్‌ చిత్తుచేసింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy