భారత్ ఫస్ట్ : H-4 వీసాలు పొందినవారిలో 93 శాతం భారతీయులే

visaఅమెరికాలో జాబ్ చేస్తున్న విదేశీ నిపుణుల భాగస్వామ్యులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు అమెరికా గవర్నమెంట్ జారీ చేసే H-4 వీసాలు పొందినవారిలో భారత్ నుంచే 93 శాతం మంది ఉన్నారని US కాంగ్రెస్‌ స్వతంత్ర కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సంస్థ(సీఆర్‌ ఎస్‌) రిపోర్ట్ తెలిపింది. US చట్టసభ్యులకు ఆశక్తి ఉన్న విషయాలపై పీరియాడిక్ రిపోర్టులను ఈ సంస్ధ ప్రిపేర్ చేస్తుంది. ఈ వీసాలు పొందినవారిలో ఐదవ వంతు కన్నా ఎక్కుమంది ఒక్క కాలిఫోర్నియాలోనే ఉన్నారని తెలిపింది. H-4 వీసాలు పొందిన వారిలో 93 శాతం మహిళలు ఉండగా, 7 శాతం మాత్రమే మగవాళ్లు ఉన్నారు. ఈ వీసాలు  అత్యధికంగా భారతీయులకు మంజూరు చేయగా, చైనా వారికి 5 శాతం, ఇతర దేశాల వారికి 2 శాతం వీసాలు అమెరికా గవర్నమెంట్ మంజూరు చేసినట్లు 9 పేజీల తన నివేదికల్ సీఆర్ ఎస్ తెలిపింది. డిసెంబర్-25, 2017నాటికి H-4 వీసాదారుల 1 లక్షా 26 వేల 853 అప్లికేషన్స్ ను US సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించింది.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy