భారత్ లోనే అతిపొడవైన వంతెన ఇదే!

dhola-sadiyaభారత దేశంలోనే అతి పొడవైన వంతెన అస్సాంలోని గౌహతిలో నిర్మాణం అవుతోంది. ఇది తుది దశకు చేరుకుంది. వచ్చే ఏడాదికల్లా ఇదే సమయానికి వంతెన పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వంతెనను ప్రారంభించేందుకు  రావాల్సిందిగా  ఆ రాష్ట్ర సీఎం శరబానాంద్  సొనవాల్ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారు.

వంతెనకు సంబంధించిన ముఖ్యాంశాలు

ధోలా-సదియా అనే బ్రిడ్జీని బ్రహ్మపుత్ర ఉపనది లోహిత్ నదిమీద నిర్మిస్తున్నారు

అస్సాం రాజధాని గౌహతికి 540 కిలో మీటర్ల దూరంలో ఉన్న సదియా ప్రాతంలో ప్రారంభమైన ఈ బ్రిడ్జీ…అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్ కు 300 కిలో మీటర్ల దూరంలో ఉన్నధోలా ప్రాంతంలో  నిర్మాణం ముగించారు.

ముంబైలోని బ్రిడ్జీ బంద్రా-వర్లీ సీలింక్ కంటే …ధోలా-సదియా బ్రిడ్జ్ 9 కిలో మీటర్ల పొడవు,అంటే 30 శాతం ఎక్కువగా ఉంది.

అరుణాచల్ ప్రదేశ్ లో విమానాశ్రయం లేనందున… ఇక్కడికి చేరుకోవాలంటే చాలా సమయం పట్టేది. అయితే ఈ వంతెన నిర్మాణంతో దాదాపు 4 గంటల సమయం ఆదాకానుంది.

2011లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టుకు 950 కోట్లు కేటాయించింది.

యుద్ధ ట్యాంకులు కూడా ప్రయాణించేందుక వీలుగా ఈ వంతెనను డిజైన్ చేశారు

అరుణాచల్ ప్రదేశ్ ..చైనాతో సరహద్దు కలిగి ఉండటంతో  సరిహద్దుల్లో ఎప్పుడైనా అనుకోని పరిణామాలు తలెత్తితే భారత ధళాలు అక్కడికి త్వరగా చేరుకునేందుకు ఈ బ్రిడ్జి ఎంతో ఉపయోగకరంగా మారనుంది.

అస్సాం నుంచి అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్లాలంటే అక్కడి ప్రజలు పడవల్లో ప్రయాణించాల్సి వచ్చేది.ఈ వంతెనతో ప్రారంభమైతే ఇక ఆ సమస్య సమిసిపోనుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy