భారత్ లో ‘రహస్య నగరం’

nuclearఅమెరికాకు చెందిన ‘ఫారిన్ పాలసీ’ అనే పత్రిక ఓ సెన్సేషనల్ స్టోరీని పబ్లిష్ చేసింది. భారతదేశం శక్తివంతమైన అణ్వస్త్ర దేశంగా అవతరించేందుకు ఓ అణు నగరాన్ని నిర్మిస్తుందని ఆ కథనం సారాంశం. అణు ఇంధన అవసరాలు తీర్చేందుకు, హైడ్రోజన్ బాంబుల తయారీకి ఈ న్యూక్లియర్ సిటీని నిర్మిస్తున్నారని ఆ పత్రిక తెలిపింది. బెంగుళూరు సమీపంలో చళ్లకెరెలో నిర్మిస్తున్న ఈ సిటీ పొరుగున ఉన్న పాకిస్థాన్, చైనాలకు భయం పుట్టిస్తుందన్నది ఈ కథనంలో ప్రధానాంశం. 2017నాటికి పూర్తవ్వనున్న ఈ నగర నిర్మాణం కోసం ఈ గ్రామంలోని జనాన్ని బలవంతంగా తరిమేశారని పత్రిక ఆరోపించింది. కొన్ని వందల ఏళ్లుగా అక్కడ అరుదైన తెగ ఒకటి నివసిస్తున్నదని.. అయితే వాళ్లను అక్కడి నుంచి వెళ్లగొట్టారని తెలిపింది. భారతదేశంలో సైన్యం నిర్వహణలో నడిచే అతిపెద్ద కేంద్రంగా ఇది రూపుదిద్దుకోనున్నట్టు ఆ పత్రిక వార్తను అందించింది.

 

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy