భారత్ లో విదేశీ బైకులు

BL23_02_BIKE_1728687g Triumph-India-line-up-03-IAMABIKERమరోరెండు కొత్త అమెరికా, బ్రిటిష్ బైక్స్ ఇండియాకు వచ్చేసాయి. పొలారిస్ ఇండియా కంపెనీ ఇండియన్ బ్రాండ్ మోటార్‌సైకిళ్లను బుధవారం భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అమెరికాకు చెందిన పొలారిస్ ఇండస్ట్రీస్‌కు అనుబంధంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పొలారిస్ ఇండియా కంపెనీ ఇండియన్ బ్రాండ్  కింద మూడు మోడళ్లను అందిస్తోంది. ప్రధాన మోడల్స్ లో క్లాసిక్(ధర రూ. 26.5 లక్షలు), వింటేజ్(ధర రూ. 29.5 లక్షలు), చీఫ్‌టైన్(ధర రూ. 33 లక్షలు) బైక్‌లను అందిస్తున్నామని పొలారిస్ ఇండియా  ఎండీ పంకజ్ దుబే చెప్పారు.  ఈ బైక్‌లను అమెరికా నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ విక్రయిస్తామని తెలిపారు. ఈ మూడు బైక్‌లకు బుకింగ్స్ ప్రారంభించామని, మార్చి నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ బైక్ లు మూడు హార్లే డేవిడ్ సన్, ట్రయింఫ్ బైక్ లతో పోటీపడతాయని ఎండీ పంకజ్ చెప్పారు. ఇక మరోవైపు బ్రిటీష్ మోడల్ బైక్స్ ట్రయింఫ్ ఇండియాలో లాంఛింగ్ చేయనున్నారు. బెంగళూర్ లో మొదటి డీలర్ షిప్ ను ప్రారంభిస్తున్నామని ట్రయింఫ్ ఇండియా ఎండీ విమల్ చెప్పారు. పది ట్రయింఫ్ బైక్ లు అల్రెడీ ఇండియాకు వచ్చేసాయని ఆయన అన్నారు. మామూలు బైక్స్ తో పాటు స్పోర్ట్స్ బైక్స్ ను కూడా లాంఛ్ చేస్తున్నామని చెప్పారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy