భారత్ లో 2021 వరల్డ్ బాక్సింగ్ పోటీలు

BOXINGక్రీడారంగంలో భారత్ మరో మైలురాయికి చేరింది. ప్రపంచ పురుషుల బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు వేదిక అయ్యింది. 2021లో జరిగే ఛాంపియన్ షిఫ్ కు ఆతిధ్యం ఇస్తోంది. రష్యా రాజధాని మాస్కోలో జరిగిన వరల్డ్ బాక్సింగ్ సమాఖ్య (AIBA) ఈ విషయాన్ని ప్రకటించింది. ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. 2018 అంటే వచ్చే సంవత్సరం మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిఫ్ పోటీలను కూడా భారత్ నిర్వహిస్తోంది. ఇండియాలో బాక్సింగ్ పై మక్కువ పెంచుకోవటానికి.. యువతలో ప్రోత్సాహానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్. మూడేళ్ల వ్యవధిలో రెండు వరల్డ్ బాక్సింగ్ పోటీలను భారత్ నిర్వహించటం గర్వంగా ఉందని.. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BFI) తెలిపింది. విజయవంతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తామని తెలిపింది. 2019లో జగరనున్న మెన్స్ పోలీసులకు సోచి వేదిక కానుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy