భారత్ VS విండీస్: వర్షంతో మ్యాచ్ రద్దు

bharathవర్షం కారణంగా భారత్‌, వెస్టిండీస్‌ మధ్య నిలిచిపోయింది. భారత్‌-వెస్టిండీస్‌ ఐదు వన్డేల సిరీస్‌ లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియా వర్షంతో ఆట నిలిచిపోయే సమయానికి 39.2 ఓవర్లలో 3 వికెట్లకు 199 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లి (32), ధోని (9) క్రీజులో ఉన్నారు. శిఖర్‌ ధావన్‌ (87) ఫామ్‌ కొనసాగించగా… రహానె (62) పరుగులు చేసి సత్తా చాటాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. తడబడకుండా ఆడింది. 38వ ఓవర్‌ కాగానే వర్షం కాగానే ఆట నిలిచిపోయింది. వర్షం తగ్గాక మళ్లీ ఆట మొదలైనా.. 40వ ఓవర్‌లో మళ్లీ ఆగిపోయింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌శర్మ స్థానంలో రహానె రాగా, జడేజా బదులు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ బరిలోకి దిగాడు. షమికి మరోసారి చోటు దక్కకపోగా, ఉమేశ్‌ యాదవ్‌ తుది జట్టులో స్థానం సంపాదించాడు.

వెస్టిండీస్‌ బౌలర్లు హోల్డర్‌, జోసెఫ్‌, బిషూ  తలా ఒక వికెట్ తీసుకున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy