భారత దేశానికే.. తెలంగాణ ఓ దిక్సూచి: కేసీఆర్

kcr- gulabiటీఆర్ ఎష్ పార్టీ అధ్యక్షుడిగా వరుసగా 8వసారి ఎకగ్రీవంగా ఎన్నుకున్నందుకు పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతూ.. ఉద్యమాభివందనాలు తెలియజేశారు సీఎం కేసీఆర్. నగరంలోని కొంపల్లి గార్డెన్ లో జరుగుతున్న టీఆర్ ఎస్ ప్లీనరీలో ఆయన ఇవాళ(ఏప్రిల్ 21) మాట్లాడారు.

2001లో తెలంగాణ ఆగమై పోయిన సందర్భంలో జై తెలంగాణ నినాదంతో టీఆర్ ఎస్ పార్టీ ఏర్పడిందన్నారు. గులాబీ జెండా ఎగిరినప్పటి నుంచి అన్ని అనుమానాలే అన్నారు. ఈ పార్టీ నిలబడేది కాదన్నారు. 15 ఏళ్ల టీఆర్ ఎస్ పోరాటంతోనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం.

భయంకరమైన గుర్రపు డెక్కతో ఇరిగేషన్ వ్యవస్థ, రెండేళ్లు భయంకరమైన కరువు, రైతులు, చేనేతల ఆత్మహత్యలు, గుడుంబా రాజ్యం, భయంకరమైన పరిస్థితులలో ఆర్టీసీ ఉండేదన్నారు. సెక్రటేరియట్ లో టీ ఉద్యోగులపై అణచివేతలు వంటి సమస్యలతో రాష్ట్రం ఉండేదన్నారు.

గులాబీ పార్టీ ఉద్యమ పోరాటంతో.. కేంద్రం ప్రభుత్వం మెడలు వంచి.. 2014లో  తెలంగాణ తెచ్చుకున్నాం.  ఆనాడు ఓ కాంగ్రెస్ మాజీ సీఎం కట్టెపట్టుకొని కరెంటు కష్టాలు వస్తాయన్నారు..కానీ 9వేల 350 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోగలుగుతున్నాం అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరీతహారం వంటి దేశంలోనే అతిపెద్ద పథకాలతో తెలంగాణ ఇవాళ దేశంలోనే అభివృద్ధి రాష్ట్రంగా.. ధనిక రాష్ట్రంగా టీఆర్ ఎస్ ప్రభుత్వం ఏర్పరిచిందన్నారు.

కోటి ఎకరాలకు నీళ్లందించే విధంగా ఇరిగేషన్ వ్యవస్థను ప్రాజెక్టుల ద్వారా  ఏర్పాటు చేసుకున్నామన్నారు. ఇవాళ కాంగ్రస్ నాయకులు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారన్నారు. నేషనల్ హైవేస్ 2వేల 500కి.మీ ఉండేవి.. ఇవాళ 5 వేల 800 కి.మీ జాతీయ రహదారులను అభివృద్ధి చేసుకున్నాం అన్నారు.

గ్రామీణ వ్యవస్థను బాగు పరచుకున్నాం.. కులవృత్తుల వాళ్లకు గొర్రెలు అందిస్తున్నామ్నారు. నాయి బ్రాహ్మణులకు  25 వేల ఆధునిక క్షౌరశాలలు అందిస్తాం.. రజకులకు వాషింగ్ మిషన్ లు, నవీన్ ధోబీ ఘాట్ లను ప్రభుత్వం నిర్మించి ఇస్తుందన్నారు.  రంగారడ్డి, హైదరాబాద్ లలో కల్లు దుకాణాలను ఆనాటి ప్రభుత్వాలు కల్తీ కల్లు అని బ్యాన్ చేయగా మళ్లీ పునరుద్ధరించుకున్నాం. బెస్తవాళ్లు, ముదిరాజ్ లకు చేపలు పంపిణీ చేస్తున్నాం అన్నారు. మత్స్య పరిశ్రమను ఏడాదికి 5 వేల కోట్ల ఆదాయం వచ్చే విధంగా అభివృద్ధి చేసుకుంటున్నాం అన్నారు. వ్యవసాయం అంటే పిల్లనివ్వడానికి వెనక్కి తగ్గే రోజులు పోయాయన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy