భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

goldబంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలతో పాటు స్థానిక నగల వ్యాపారుల  నుంచి డిమాండ్‌ బాగా తగ్గిపోవడంతో బంగారం ధర భారీగా పడిపోయింది. బుధవారం (మే-16) ఒక్కరోజే రూ.430 తగ్గిపోయింది. మార్కెట్లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.430 తగ్గి రూ.32,020గా ఉంది.  మరోవైపు,  వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కేజీ వెండి ధర రూ.250 తగ్గి రూ.40,650గా ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒక్క ఔన్స్‌కు 1300 డాలర్ల కిందకి పడిపోవడంతో, దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి.

 

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy