భారీ ఆధిక్యంలో న్యూజిలాండ్

mccullum-650_020714064626రెండో టెస్ట్ లో టీమిండియాకు భారీ లక్ష్యం. ఫస్ట్ ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ ను కట్టడి చేసిన భారత్ సెకండ్ ఇన్నింగ్స్ లో చేతులెత్తేసింది. వికెట్లు తీయడంలో బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. భారత బౌలర్ల దెబ్బకు రెండో రోజు త్వరగానే వికెట్లను కొల్పోయింది. అయితే మూడో రోజు మాత్రం పూర్తిగా ఆటను తమవైపుకు తిప్పుకుంది న్యూజిలాండ్. 252 పరుగులకు 5 వికెట్లను కొల్పోయినా పటిష్ఠ స్థితిలో నిలిచింది. న్యూజిలాండ్ కు బ్రాండెన్ మెక్ కల్లమ్ భారీ ఇన్నింగ్స్ అందించాడు. ఇక నాలుగో రోజు ఆటలో న్యూజిలాండ్ పూర్తిగా తమ ఆదీనంలోకి తెచ్చేకుసుకంది.

న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసి 325 పరుగుల ఆధిక్యంలో ఉంది. నిన్న 67 పరుగుల చేసిన వాల్టింగ్ ఈ రోజు సెంచరీ చేశాడు. 124 పరుగుల వద్ద మహ్మద్ షమీ బౌలింగ్ ఎల్బీడబ్లూ గా వెనుదిరిగాడు. దీంతో వారిద్దరి మధ్య నెలకొన్న 352 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అయితే మెక్ కల్లమ్ మాత్రం డబుల్ సెంచరీ చేసి ట్రిబుల్ సెంచరీ కి చేరువలో ఉన్నాడు. అయితే రేపు జరిగే ఆటమ్యాచ్ కు కీలకం కానుంది. ప్రస్తుతం గ్రీజులో మెక్ కల్లమ్ 281, నీషమ్ 67 పరుగులతో ఆడుతున్నారు. న్యూజిలాండ్ 571 పరుగులకు 6 వికెట్లను కొల్పోయింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy