భారీ ధరకు అమ్ముడు పోయిన హిట్లర్ ఫోన్

hitler-phone-auctionరెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ఉపయోగించిన పర్ననల్ ఫోన్ వేలానికి వచ్చింది. ఆదివారం యూఎస్ హౌస్‌లో జరిగిన వేలం పాటలో ఈ చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఫోన్‌ను రెండున్నర లక్షల డాలర్లతో సొంతం చేసుకున్నట్లు అలెగ్జాండర్ హిస్టారికల్ ఆక్షన్స్ సంస్ధ తెలిపింది. లక్షలాది మందిని హత్య చేయడానికి ఈ ఫోన్ ద్వారానే హిట్లర్ తన కమాండోలకు ఆదేశాలు జారీ చేసే వారట. అందుకే ఈ ఫోన్ ను అత్యంత విధ్వంసర ఆయుధంగా యూఎస్ హౌస్ అభివర్ణిస్తోంది. ఫ్యూర‌ర్ సీమెన్స్ కంపెనీకి చెందిన ఈ ఫోన్ మొదట్లో నలుపు రంగులో ఉండేదట. తర్వాత ఈ ఫోన్ కు ముదురు ఎరుపు రంగును వేసారు. ఫోన్ మీద హిట్ల‌ర్ పేరు, స్వ‌స్తిక్ గుర్తు కూడా ఉన్నాయి. ఈ ఫోన్‌ను 1945లో బెర్లిన్‌లోని హిట్లర్‌కు చెందిన బంకర్‌లో కనుగొన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy