భారీ బడ్జెట్ : గుణశేఖర్ డైరెక్షన్ లో హిరణ్యకశ్యపుడిలా రానా

gunaరానా దగ్గుబాటి హీరోగా గుణశేఖర్ డైరక్షన్ లో 180 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఓ సినిమా తెరకెక్కనుంది. దీనికి “హిరణ్యకశ్యపా”అని పేరు పెట్టారు. ఈ సినిమాలో హిరణ్యకశపుడు, నరసింహస్వామి పాత్రలను రానా దగ్గుబాటి చేస్తుండగా, ఈ సినిమాను ఆయన తండ్రి, ప్రొడ్యూసర్ డి. సురేష్ బాబు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చే సంవత్సరం మొదట్లో ఈ సినిమా ఘూటింగ్ మొదలయ్యే అవకాశముంది. ఈ సినిమా కోసం టాప్ ఆర్టిస్టులు పనిచేస్తున్నారని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ భక్తప్రహాద ఆల్రెడీ చూశారని,  అందువల్ల ఈ సినిమా అంత ఈజీ కాదని, దీని కోసం పెద్ద విజువల్స్ ఈమేజిన్ చేయాల్సి ఉంటుందనిఆయన తెలిపారు. భారత్ లోని టాప్ ఆర్టిస్ట్ అయిన ముఖేష్ సింగ్  ఈ సినిమాలో… వైకుంఠం, ఇంద్రలోకం, అదేవిధంగా నరసింహ అవతారం వంటి వివిధ మైథలాజికల్ ప్లేస్ట్ లు, క్యారెక్టర్లను డ్రాయింగ్ చేస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy