భారీ మొత్తంలో పాత నోట్లు స్వాధీనం

old currencyపాత కరెన్సీ నోట్లను పోలీసులు భారీగా పట్టుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని సూరజ్‌పాల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. నిందితుల నుంచి రూ. 2.7 కోట్ల విలువైన రద్దయిన పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్). హోంగార్డుతో పాటు మరో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఓ బట్టల వ్యాపారి తన ఇంట్లో పెద్ద మొత్తంలో పాత నోట్లను మార్చుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఎటీఎస్ ఎస్పీ వికాస్ కుమార్  నేతృత్వంలో దాడి చేసి నోట్లను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy