భార్యా, భర్తల సెల్ఫీ సరదా…చిన్నారి ప్రాణం తీసింది

PPPసెల్ఫీ ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. ఓ సెల్ఫీ సరదా 10 నెలల చిన్నారి ప్రాణం తీసింది. రాజస్ధాన్ లోని గంగానగర్ జిలాలో గురువారం(మే-10) ఈ ఘటన జరిగింది.
రాజస్ధాన్ రాష్ట్రంలోని గంగానగర్ జిల్లాకు చెందిన దంపతులు తమ 10 నెలల చిన్నారికి హెల్త్ చెకప్ చేయించడం కోసం దగ్గర్లోని ఓ హాస్పిటల్ కు వెళ్లారు. హాస్పిటల్ లో చెకప్ అయిన తర్వాత అక్కడినుంచి ఓ షాపింగ్ మాల్ కు వెళ్లారు. షాపింగ్ మాల్ లోని ఎస్కలేటర్‌ ఎక్కిన తర్వాత సెల్ఫీలు తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ సమయంలో మహిళ ఎత్తుకున్న చిన్నారి బ్యాలెన్స్ తప్పి కిందపడిపోయింది. ఎస్కలేటర్ రెయిలింగ్ ఢీకొని అక్కడికక్కడే చిన్నారి మృతి చెందింది. అక్కడ ఉన్న సీసీటీవీల్లో ఈ ఘటన రికార్డు అయింది. ఎస్కలేటర్ పై ఉన్న సమయంలో ఆమె భర్త సెల్ఫీ అగడంతో సెల్ఫీ కోసం ప్రయత్నించి.. బ్యాలెన్స్ తప్పడంతోనే చిన్నారి ప్రాణం కోల్పోయిందని అక్కడ ఉన్నవారు తెలిపారు. ఆమె అజాగ్రత్తతోనే.. చిన్నారి ప్రాణం కోల్పోయిందని వారు తెలిపారు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy