
భార్య అమెరికాలో మిషిగాన్ లో స్టూడెంట్ వీసాపై ఉంది. అయితే విడాకుల కేసుకు డైరెక్ట్ గా హాజరయ్యే వీలు తనకు లేదని, వాట్సాప్ లో వీడియో కాల్ ద్వారా విచారణకు హాజరవుతానని ఆమె చెప్పింది. భర్త కూడా మిషిగాన్ లోనే పని చేస్తున్నా.. ప్రస్తుతం వేరే పని మీద నాగపూర్ రావడంతో అతను కోర్టుకు హాజరయ్యాడు. ఆమె వాట్సప్ వీడియో కాల్ ద్వారా ఈ విచారణకు హాజరైంది. భార్యకు భర్త ఒకేసారి రూ.10 లక్షలు చెల్లించాలన్న రూల్ తో నాగపూర్ ఫ్యామిలీ కోర్టు జడ్జి స్వాతి చౌహాన్ విడాకులు మంజూరు చేశారు.
2013, ఆగస్ట్ 11న సికింద్రాబాద్ లో ఈ ఇద్దరి పెళ్లి జరిగింది. ఇద్దరూ కొంత కాలం మిషిగాన్ లో కలిసి ఉన్నా.. భార్య నాగపూర్ కు వచ్చి అత్తగారింట్లో కొన్నాళ్లు ఉండటంతో గొడవలు మొదలయ్యాయి. విడిపోవాలనకున్న వారికి ఇలా వాట్సాప్ లోనే విడాకులు ఇచ్చింది కోర్టు.