భావోద్వేగం : బధిరులతో అమితాబ్ జాతీయగీతం

national-anthem-sign-lang70ఏళ్ల స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కేంద్రం ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర మానవ వనరుల శాఖ విడుదల చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది. బదిరుల భాషలో ప్రత్యేకంగా రూపుందించిన ఈ వీడియోలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ హైలెట్ గా నిలిచారు. జాతీయ గీతాన్ని దివ్యాంగులతో కలిసి ఆలపించారు అమితాబ్. దివంగత ఆదేశ్ శ్రీవాస్తవ మ్యూజిక్ కంపోజ్ చేయగా.. గోవింద్ నిహ్లానీ డైరెక్ట్ చేశారు. కాన్సెప్ట్ సతీశ్ కపూర్. ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కించుకుంటోంది.

ప్రాచీన సంస్కృతికి.. సంప్రదాయానికి భారత్ ఓ ప్రతీక అని.. సంకేతాల్లో విషయాన్ని వ్యక్తీకరించడం అప్పటి నుంచే ఉందని… అందుకే.. ఈ విధంగా వీడియో రూపొందించామంటున్నారు కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే.

https://youtu.be/IUfAwxFohoI

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy