భిన్నత్వమే భారత్ బలం: వెంకయ్య

venkaiah-naiduభిన్నత్వంలో ఏకత్వమే భారత బలమన్నారు వెంకయ్యనాయుడు. రైతు కుటుంబం నుంచి వచ్చి ఉప రాష్ట్రపతి కావడం మన వ్యవస్థ గొప్పతనమేనన్నారు. ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న ఆయన.. సోమవారం తిరుమలల శ్రీవారిని దర్శించుకోనున్నారు.

ఉప రాష్ట్రపతిగ ఎన్నికైన వెంకయ్యనాయుడిని బెంగళూరుల ఘనంగ సన్మానించారు బీజేపీ కార్యకర్తలు. చానా ఏళ్ల నుంచి బెంగళూరుతో తనకు అనుబంధం ఉందని.. ఉప రాష్ట్రపతి అయిన తర్వాత తొలిసారి బెంగళూరు రావడం సంతోషంగా ఉందన్నారు వెంకయ్య. పేదలు, ధనవంతుల మధ్య ఆర్థిక అసమానతలు తొలగించేందుకు ప్రభుత్వాలు పనిచేయాలన్నారు వెంకయ్య.  రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.

బెంగళూరు నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకున్న వెంకయ్యకు బీజేపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఇవాళ రాత్రికి తిరుమలలో ఉంటారు వెంకయ్య. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుంటారు. తర్వాత తిరుపతిలో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత.. సొంతూరు నెల్లూరు జిల్లా చవటపాలెం వెళ్తారు.

అంతకు ముందు… ఢిల్లీలో పొద్దుగాల వెంకయ్యనాయుడును మర్యాదపూర్వకంగ కలిశారు రాష్ట్రమంత్రి కేటీఆర్. ఉప రాష్ట్రపతిగ ఎన్నికైనందుకు శుభాకాంక్షలు చెప్పారు. తెలుగువారైన వెంకయ్య.. ఈస్థాయికి ఎదగడం ఆనందంగా ఉందన్నారు కేటీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy