భూపాలపల్లిలో గండ్రను ఇంటికి పంపిన మధుసూదనాచారి…

ఒకప్పుడు అది కుగ్రామం. ఇప్పుడు నియోజకవర్గం. కుగ్రామాన్ని మైనింగ్ నియోజకవర్గం స్థాయికి చేర్చింది. అదే వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి సెగ్మెంట్.

 • 1980లో భూపాలపల్లి ఓ కుగ్రామం.
 • బొగ్గు గనులు పుష్కలంగా ఉన్నట్టు తెలయడంతో తవ్వకాలకోసం సింగరేణి సంస్థకు అప్పజెప్పారు.  దాంతో కుగ్రామంగా ఉన్న భూపాలపల్లి గ్రామ పంచాయితీగా తర్వాత నగర పంచాయితీగా మారింది.
 • 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది.
 • భూపాలపల్లి సెగ్మెంట్ లో చిట్యాల, మొగుళ్ల పల్లి, శాయంపేట, ములుగు, ఘన్ పూర్ మండలాలున్నాయి.
 • మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 32 వేల 053.
 • మహిళా ఓటర్లు లక్షా 15 వేల 001 మంది.
 • పురుష ఓటర్లు లక్షా 17 వేల 031 మంది.
 • 2009 డీలిమిటేషన్ లో భాగంగా శాయంపేట స్థానంలో భూపాలపల్లి నియోజకవర్గం ఏర్పడింది.
 • శాయంపేట 1978లో నియోజకవర్గంగా ఏర్పడింది.
 • 1978, 83లో అక్కడ జంగారెడ్డి గెలిచారు. 1985, 89లో కాంగ్రెస్ అభ్యర్థి మందాడి నర్సింహరెడ్డి గెలిచారు.
 • 1994లో టీడీపీ అభ్యర్థి మధుసూధనాచారి విజయం సాధించారు.
 • 1999, 2004లో కాంగ్రెస్ కొండాసురేఖ విజయం సాధించారు.
 • గత ఎన్నికల్లో గండ్ర వెంకటరమణా రెడ్డి కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.
 • 2009లో డీలిమిటేషన్ లో భాగంగా శాయంపేట కనుమరుగై భూపాలపల్లి ఏర్పడింది.
 • శాయంపేట నుంచి గెలిచిన మందాడి నర్సింహారెడ్డి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. ఈ సెగ్మెంట్నుంచి గెలిచిన కొండా సురేఖ వైఎస్ కేబినెట్ లో మంత్రయ్యారు.

…………………….

 • బొగ్గుగనులతో భూపాలపల్లి దినదినాభివృద్ధి సాధించింది.
 • పారిశ్రామికంగా ఎదిగింది.
 • అయితే పట్టణంగా మారుతున్న క్రమంలో మౌలిక సదుపాయాల్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.
 • భూపాలపల్లిలో బస్ డిపో ఉన్నా బస్ స్టేషన్ లేకపోవటం నేతల నిర్లక్ష్యానికి సంకేతం.
 • కరీంనగర్, హైదరాబాద్, అదిలాబాద్, బెంగుళూరు నుంచి ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
 • అయినా బస్ స్టేషన్ మాత్రం లేదు.

గత ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి బస్ స్టేషన్ తో పాటు, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. పాటు తాగునీటి కొరత తీరుస్తానని హామీ ఇచ్చారు. కానీ ఈ ఐదేళ్లలో ఈ హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదంటున్నారు స్థానికులు.

 • నియోజక వర్గంలో చిట్యాల, భూపాలపల్లి మండలాలు పూర్తిగా అటవి గ్రామాలు.
 • ఆ మండలాల్లో కనీస వసతులు లేక ఇబ్బందిపడే జనం చాలామందే.
 • విద్య, వైద్యావకాశాలు అంతంతమాత్రమే.
 • అటవీ గ్రామాలు కావటంతో వర్షాకాలంలో ఇబ్బందిపడే ఊళ్లు చాలానే ఉన్నాయి.
 • నియోజకవర్గానికి రోడ్ కనెక్టివిటీ ఉన్న గ్రామాలు తక్కువే.
 • కల్వర్టులు లేకపోతే ఒక గ్రామానికి మరో గ్రామానికి సంబంధాలు తెగిపోయే పరిస్థితి.
 • నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తానని గండ్ర వెంకట రమణరెడ్డి హమీ ఇచ్చారు. కానీ పరిశ్రమ ఏర్పాటుకు ఆయన చేసిన ప్రయత్నం శూన్యమంటున్నారు.
  ……………………..
 • గండ్ర వెంకరమణారెడ్డి చేతలకు విసుగెత్తిన భూపాలపల్లి వాసులు ఈసారి ఆయనకు మొండిచేయినే చూపించారు.
 • సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన గండ్ర టీఆర్ఎస్ అభ్యర్ధి ఎస్. మధుసూదనాచారి చేతిలో ఓడిపోయారు.
 • 7310 ఓట్ల మెజారిటీతో మధుసూదనాచారి గండ్రపై విజయం సాధించారు.

……………..

 

 

 

 

Comments are closed.

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy