భూమి సైజులో వజ్రమా..!

earth-sized-diamondడైమండ్ చూశారు కదా..! నెక్లెస్ లలో చిన్న చిన్న సైజులో చూసుంటారులే. అతి పెద్ద డైమండ్ అంటే ఎంతుండొచ్చు.. మా అంటే టక్కరి దొంగ సినిమాలో చూపించినట్లు ఓ పిడికెడు ఉండొచ్చు. కానీ డైమండ్ భూమి సైజులో ఉంటుందంటే నమ్ముతారా..? కానీ ఈ స్టోరీ చదివితే నమ్మక తప్పదు. గెలాక్సీలో స్ట్రాంగెస్ట్ స్టార్ ను కనుగొన్న ఆస్ట్రానమర్స్.. దాన్ని డైమండ్ గా ఫైనలైజ్ చేశారు. అత్యంత చల్లదనం వల్ల కోట్ల సంవత్వరాల కింద.. ఈ స్టార్ డైమండ్ గా మారిందట. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మిల్వాకి కి చెందిన ప్రొఫెసర్ డేవిడ్ కప్లాన్ దీని గురించి చెబుతూ.. ఇదొక అద్భుతమైన వజ్రమని అన్నారు. వైట్ డ్వార్ఫ్ అనే ఈ స్టార్స్ చాలా డిమ్ గా ఉండటం వల్ల తొందరగా బయట పడటం తేదన్నారు. విశ్వం ఏర్పడినప్పుడు జరిగిన ఫ్యూజన్ చర్యలో హీట్, ఎనర్జీ మొత్తాన్ని బయటికి పంపించి, కార్బన్, ఆక్సిజన్ ను మాత్రం తనలోనే ఉంచుకున్నాయట. దీంతో మెల్ల మెల్లగా చల్ల బడుతూ చివరికి పెద్ద పెద్ద వజ్రాలుగా మారాయట. వీటి వయసు మిల్కీ వేకు సమానంగా ఉంటుందని ఆస్ట్రోనమర్స్ అంటున్నారు. అంటే దాదాపు 11 బిలియన్ ఏళ్ల కిందట ఇవి ఏర్పడ్డాయన్నమాట.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy