భూసేకరణ చట్టం అమలుపై మంత్రులతో కమిటీ..

భూసేకరణ చట్టం అమలు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఆధ్వర్యంలోని మరో నలుగురు మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. భూసేకరణపై ఈ కమిటీ విధివిధానాలను తయారు చేయనుంది. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు, కేటీఆర్, జోగు రామన్న సభ్యులుగా కొనసాగనున్నారు. వీలైనంత త్వరగా నివేదిక తయారు చేయాలని సీఎం కేసీఆర్ కమిటీకి ఆదేశాలు  జారీ చేశారు.

ఆగస్టు 15 నుంచి ప్రభుత్వం దళితులకు భూపంపిణీ చేయాలని భావిస్తోంది. దీంతో అన్ని జిల్లాల్లో ప్రభుత్వానికి సంబంధించి ఉన్న భూముల గురించి ఆరా తీస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో పాటు ఎంత మంది లబ్ది దారులు ఉన్నారో అన్న విషయం గుర్తించేందుకు ప్రతి మండలానికి ఒక ప్రత్యేకాధికారిని నియమించాలని భావిస్తోంది. ప్రత్యేకాధికారి లబ్ది దారుల ఆర్ధిక, విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి అంశాలపై వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఆ నివేదిక ఆధారంగా లబ్దిదారులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. గత ప్రభుత్వాల చేసిన భూపంపిణీలో ఎవరికి భూమి అందిందనే అంశాన్ని పరిశీలించనున్నారు.

దళితుల భూముల్లో అక్రమణల గురించి కూడా పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నారు. ప్రతి జిల్లాల్లో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములు గుర్తించాలని…కలెక్టర్లకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. క్షేత్ర స్థాయిలో అన్ని మండలాల్లో తహశీల్దార్లతో సమీక్షలు నిర్వహిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. భూపంపిణీకి సుమారు లక్ష ఎకరాల భూమి కావాలని..ప్రభుత్వ భూములు దొరకకపోతే ఆయా జిల్లాల్లో ప్రైవేట్ భూములను కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రభుత్వ భూముల లభ్యత, వ్యయం గురించి నివేదిక తయారు చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాకు రూ.600ల నుంచి రూ.800 కోట్లు కేటాయిస్తే దళితుల భూపంపిణీకి ఇబ్బందులు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy