భూ రికార్డుల ప్రక్షాళనకు 1,468 టీమ్స్: సీఎం కేసీఆర్

kcrభూ రికార్డుల పర్యవేక్షణ కార్యక్రమాన్ని రెవెన్యూ అధికారులు చిత్తశుద్ధి.. అంకితభావంతో నిర్వహిస్తున్నారని ప్రశంసించారు సీఎం కేసీఆర్. భూ యాజమాన్య హక్కులపై స్పష్టత వస్తున్నందున రైతులకు ఊరట కలుగుతోందన్నారు.

ప్రగతిభవన్‌లో భూ రికార్డుల ప్రక్షాళనపై రెవెన్యూ అధికారులతో.. సీఎం  సమీక్ష నిర్వహించారు. సవరించిన రికార్డుల ఆధారంగానే సాగుకు పెట్టుబడి ఇస్తామన్నారు.భూరికార్డుల ప్రక్షాళనలో పాల్గొంటున్న సిబ్బందికి నగదు ప్రోత్సాహం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 11.55 లక్షల ఎకరాల భూ రికార్డులను పరిశీలించారన్నారు. ఇప్పటి వరకు 9.48లక్షల ఎకరాల భూములకు యాజమాన్య హక్కులు కల్పించామన్నారు. రైతుల సమ్మతితోనే యాజమాన్యం హక్కులు ఇచ్చారన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన కోసం 1,468 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 568 రెవెన్యూ మండలాల్లో 10 వేల 875 గ్రామాల్లో భూ రికార్డులను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. మొదటి విడతలో 1,252 గ్రామాల్లో రికార్డుల ప్రక్షాళన ఉంటుందన్నారు. 1.78కోట్ల సర్వే నెంబర్లలోని 75.54 లక్షల ఖాతాలు, 2.45కోట్ల ఎకరాల భూమికి సంబంధించిన రికార్డుల ప్రక్షాళన చేపడుతున్నట్లు తెలిపారు సీఎం.

పార్ట్ -Aలో వివాదాల్లో లేని భూ రికార్డులను పరిశీలించాలన్నారు. డిసెంబర్‌ 31 వరకు పార్ట్-A కార్యక్రమం పూర్తవుతుందన్నారు సీఎం కేసీఆర్.

విదేశాల్లోని యజమానులు కూడా భూమి రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చన్నారు సీఎం. సంబంధిత భూరికార్డులు పంపిస్తే అధికారులు పరిశీలించి యాజమాన్య హక్కులపై స్పష్టత ఇస్తారన్నారు. ఇందుకు సంబంధించి నాలుగైదు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. తొలివిడత పూర్తికాగానే స్పష్టత వచ్చిన భూములకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy