భూ సర్వే: యూనిట్ గా మూడు గ్రామాలు

kcrభూ సర్వేలో ప్రతి మూడు గ్రామాలకు ఒక అధికారుల బృందం ఉంటుందన్నారు సీఎం కేసీఆర్.  మూడు గ్రామాలు యూనిట్‌గా ఒక్కో MLA  పనిచేయాలన్నారు. భూ సమగ్ర సర్వే, రైతు కమిటీలు, సంక్షేమ పథకాలపై.. తెలంగాణ భవన్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశం నిర్వహించారు. భూ సర్వే పూర్తయ్యే వరకూ ఎవరూ హైదరాబాద్ రావద్దని సీఎం కేసీఆర్ సూచించారు.

5వేల ఎకరాలకు క్లస్టర్‌, ఒక ఏఈవోను ఇస్తామన్నారు. రైతుల మనసుల్లో మనం చిరస్థాయిగా నిలిచిపోవాలన్నారు. జిల్లా సమాఖ్యలో 24మంది, రాష్ట్ర సమాఖ్యలో 42 మంది ఉంటారన్నారు. 2వేల500 క్లస్టర్లు , 2వేల 500 భవనాలు కట్టిస్తామన్నారు. వెయ్యి మంది డేటా ఆపరేటర్లను నియమిస్తామని తెలిపారు. రిజిస్ట్రార్‌ లేని దగ్గర తహశీల్దార్ లే రిజిస్ట్రార్‌లన్నారు సీఎం కేసీఆర్.

TRSకు రాబోయే ఎన్నికల్లో 100 నుంచి 105 సీట్లు వస్తాయన్నారు సీఎం కేసీఆర్‌.  ప్రజల్లో మనకే విశ్వాసం ఉందన్నారు. ప్రతిపక్షాలను ప్రజలు నమ్మడంలేదన్నారు. 2019లో అధికారం మనదే నన్న సీఎం… నియోజకవర్గంలోని ప్రజలకు ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy