భూ సేకరణ బిల్లుకు లోక్ సభ ఓకే !

NarendraModi3భూసేకరణ సవరణ బిల్లుకు..లోక్ సభ ఆమోదముద్ర వేసింది. మూజువాణి ఓటుతో దిగువ సభ గడప దాటింది. బిల్లుపై చాలాసేపు చర్చ జరిగిన తర్వాత… కేంద్రం 11 సవరణలు ప్రతిపాదించింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాలు వీగిపోయాయి.

భూసేకరణ సవరణ బిల్లును కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సభలో ప్రవేశపెట్టారు. శివసేన,అకాళీదళ్, టీడీపీ,మద్దతు బిల్లును సపోర్ట్ చేశాయి. బిల్లును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్, బీజేడీ వాకౌట్ చేశాయి. తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశాయి. టీఆర్ఎస్ ఇన్ డైరెక్ట్ గా బిల్లుకు మద్దతిచ్చింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన తీర్మానాల్లో..ప్రభుత్వానికి మద్దతుగా నిలిచింది. కొన్ని తీర్మానాల్ని మాత్రం గులాబీ పార్టీ ఎంపీలు వ్యతిరేకించారు.

బిల్లుపై చర్చలో పాల్గొన్న కాంగ్రెస్..సర్కార్ పై విరుచుకుపడింది. బిల్లుతో రైతుల్ని బలిపశువులు చేస్తున్నారని ఆరోపించింది. రైతుల భూముల్ని లాక్కొని..కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని మోడీ సర్కార్ పై విరుచుకుపడ్డారు టీఎంసీ నేతలు. పేదల నుంచి ప్రీగా భూమిని లాక్కునేందుకే…ఎన్డీఏ సర్కార్ బిల్ తీసుకువచ్చిందని ఆరోపించారు ఎంఐఎం నేత అసదుద్దీన్ . ప్రపంచంలో ఏ సర్కార్ ఇలా చేయలేదని మండిపడ్డారు.

భూసేకరణ సవరణ బిల్లుతో రైతులకు అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ చౌదరి. దేశ అభివృద్ధి కోసమే బిల్లు తీసుకొచ్చమన్నారు కేంద్ర మంత్రి.

బిల్లుకు మిత్రపక్షాలే గండి కొట్టే చాన్స్ ఉండటంతో..పీఎం మోడీ స్పెషల్ కేర్ తీసుకున్నారు. అలయెన్స్ తో ప్రత్యేకంగా సమావేశమై..అనుమానాలు తీర్చారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ కమిటీ బేటీలో నేతల్ని డైరెక్షన్ చేశారు మోడీ. లోక్ సభలో బిల్లు గట్టెక్కినా ..అసలు కథంతా రాజ్యసభలోనే ఉందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy