భోజ్‌ పురి పాటలతో.. పోలీసుల స్టెప్పులు

పట్టపగలు..అందరూ చూస్తుండగానే డ్యాన్సులతో రచ్చ చేశారు పోలీసులు. యూనిఫామ్ లోనే భోజ్ పురి పాటలతో అదరగొట్టారు. యూపీలో జరిగిన ఈ సంఘటనపై పలువురు సీరియస్ అవుతున్నారు. పబ్లిక్ తప్పు చేస్తే శిక్షించాల్సి పోయి..ఇలా డ్యూటీలోనే డ్యాన్సులు చేస్తారా అంటూ సోషల్ మీడియాలో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. దీనిపై యూపీ పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ వీడియోలో ముగ్గురు పోలీసులు యూనిఫాంలో ఉండి పాటకు తగ్గట్టుగా డాన్సులు చేయగా .. మరికొందరు యువకులు వారిని ప్రోత్సహిస్తూ స్టెప్పులు వేశారు. ఈ వీడియోలో ఉన్న పోలీసులను బ్రజేశ్‌ కుమార్, సుబోధ్‌, కుల్దీప్‌లుగా అధికారులు గుర్తించారు. ఔర్యా జిల్లాలోని అజిత్‌మాల్‌ ప్రాంతంలో వారు డ్యాన్సులు వేశారని తెలుసుకున్నారు.

అయితే పోలీసులతో కలిసి డ్యాన్సు చేసిన యువకులు ఎవరో తెలియాల్సి ఉంది. ఔర్యా ఎస్పీ త్రివేణి సింగ్‌ ఈ ఘటనపై మాట్లాడుతూ… నగర పోలీస్‌ అధికారి శివరామ్‌ సింగ్‌ ఈ విషయంపై విచారణ చేపడతారని, అనంతరం ఆ పోలీసులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.  బ్రజేశ్ కుమార్‌ తన మేనల్లుడి పుట్టిన రోజు సందర్భంగా అందరికీ మిఠాయిలు పంచి ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

 

 

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy