భోపాల్ గ్యాస్ కేసులో నిందితుడు అండర్సన్ మృతి…

warren1984లో భోపాల్ లో జరిగిన గ్యాస్ లీకేజ్ కేసులో ప్రధాన నిందితుడు, యూనియన్ కార్బైడ్ మాజీ చైర్మన్ వారెన్ అండర్సన్(92) చనిపోయారు. 1984 డిసెంబర్ 2 తేది అర్ధరాత్రి భోపాల్ లో ఆండర్సన్ కు చెందిన యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి ‘మిథైల్ ఐసో సైనైడ్’ అనే డేంజరస్ గ్యాస్ లీక్ అయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 3 వేల మందికి పైగా చనిపోయారు, పదివేలమందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత ఆయన అమెరికాకు పారిపోయాడు. దీంతో ఆయనను ప్రభుత్వం పట్టుకోలేకపోయింది. అయితే, అనారోగ్యంతో సెప్టెంబర్ 29న  అమెరికాలో అండర్సన్ చనిపోయారని ఆయన కుటుంబ సభ్యులు ఈ రోజు బయటపెట్టారు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy