మంచి అవకాశం : వ్యవసాయ ఆవిష్కరణలకు టీ-హబ్ పిలుపు

agriculture-thub

వ్యవసాయానికి టెక్నాలజీ తోడైతే అద్భుతాలు సాధించవచ్చు. ఇదే ఆలోచనతో హైదరాబాద్ టీ-హబ్ కొత్త వ్యవసాయ ఆవిష్కరణలకు పిలుపునిచ్చింది. ఇందుకోసం నూతన టెక్నాలజీ బ్లాక్‌చైన్ ఆధారంగా అంతర్జాతీయంగా పేరొందిన స్టాన్లీ బ్లాకర్ అండ్ డెకర్ సంస్థతో కలిసి స్టార్టప్‌ల కోసం పోటీలను నిర్వహిస్తున్నది. ఈ నెల 12వ తేదీ నుంచి మొదలైన దరఖాస్తుల స్వీకరణ ఏప్రిల్ 15వ తేదీతో ముగియనున్నది.

మే 15న విజేతలను ప్రకటిస్తారు. డిజిటల్ ఫార్మింగ్, ఆఫ్ గ్రిడ్ ఎనర్జీ, మైక్రో ఇరిగేషన్, గ్రిడ్ టైడ్ సోలార్, డిస్ట్రిబ్యూటెడ్ సోలార్ కోల్డ్ స్టోరేజ్, రైతులకు మైక్రో పేమెంట్లు వంటి ఆరు ప్రధాన అంశాల్లో స్టార్టప్‌లకు పోటీలు నిర్వహిస్తారు. సౌరశక్తిని ఉత్తమంగా ఉపయోగించుకోవడం, అధిక వ్యవసాయ ఉత్పత్తి, రైతులకు మెరుగైన ఆదాయం, అత్యుత్తమ జీవనవిధానం కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఈ పోటీలు జరుగుతాయి. స్థానిక స్టార్టప్‌లతోపాటు అంతర్జాతీయంగా ఉన్న స్టార్టప్‌లు కూడా ఈ పోటీకి అర్హులని ప్రకటించింది టీ-హబ్. పోటీలో విజేతలకు నగదు బహుమతితోపాటు స్టాన్లీ బ్లాక్ అండ్ డెకర్ సంస్థతో ఒప్పందం, టీ హబ్ మెంటర్లు, పరిశ్రమ నిపుణులు, పెట్టుబడిదారులతో అనుసంధానమయ్యే అవకాశం ఉంటుంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy