మంచి వాళ్లకేనా కష్టాలు…

Suraj-Parmar-380x260సమస్యలపై పోరాడటంలో అతనో ఫైటర్. కానీ చుట్టుముట్టిన సమస్యలకు తలవొంచాడు. అతనో మనసున్న మనిషి. సమస్యల్లో ఉన్నవాళ్లనెవర్నైనా ఆదుకునే మనస్తత్వం. కానీ తనువు చాలించే ముందు అతనికెవరూ సాయం చేయలేకపోయారు. కోట్లకు పడగలెత్తినా… అందరితో కలుపుగోలుగా ఉండే తత్వం. కానీ ఆత్మహత్యకు ముందు కొన్ని గంటల పాటు ఒంటరిగా గడిపాడు. అతనే ముంబై థానేలోని బిల్డర్ సూరజ్ రమేష్ పర్మార్. సమస్యల సుడిగుండంలో చిక్కుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన ఆత్మహత్య… మహారాష్ట్రను కుదిపేసింది. రియల్ ఎస్టేట్ రంగాన్ని షేక్ చేసింది.

ఆర్ధిక సమస్యలతో సతమతమవుతూ… థానేకు చెందిన పేరున్న బిల్డర్ సూరజ్ రమేష్ పర్మార్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన లైసెన్స్డ్ రివాల్వర్ తో… కాల్చుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. కాస్మోస్ గ్రూప్ చైర్మన్.. మేనేజింగ్ డైరెక్టర్ సూరజ్ రమేష్ పర్మార్.. ఆత్మహత్య సంచలనం సృష్టించింది. రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదిపేసింది.

మూడు దశాబ్దాలుగా ముంబై, థానే, బివండి, లోనావాలా, దాదర్, విరార్ లాంటి కాస్ట్లీ ఏరియాల్లో కాస్మో సంస్థ… ప్రాజెక్ట్ లు నిర్మించింది. కాస్మోస్ లంగ్, కాస్మోస్ జివెల్స్, కాస్మోస్ స్ర్పింగ్స్, కాస్మోస్ ఆర్చిడ్స్ అంటూ కాస్ల్టీ ప్రాజెక్టులెన్నో చేపట్టింది. రియాల్టీ వరల్డ్ లో ప్రామినెంట్ పర్సన్ గా ఎదిగారు పర్మార్. సమస్యలపై పోరాడే తత్వం, కలుపుగోలు మనస్తత్వం, రియాల్టీ లాబీలో ఆయనకున్న అనుభవం అన్నీ కలిపి.. మహారాష్ట్ర హౌజింగ్ ఇండస్ట్రీ అఫ్ ఛాంబర్ కు ప్రెసిడెంట్ ని చేశాయి. రియల్టర్ల తలలో నాలుకలా వ్యవహరించే ఆయన వ్యక్తిత్వానికి అందరూ ఫిదా అయ్యేవాళ్లు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం… అందర్నీ షాక్ కు గురిచేసింది.

కాసర్వాదవులీలో నిర్మించిన బంగ్లాలో… రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయారు పర్మార్. కొన్ని గంటల పాటు తన ఛాంబర్ లో ఒంటరిగా గడిపిన పర్వార్… చివరిసారిగా ఆఫీస్ బాయ్ తో చాయ్ తెప్పించుకుని తాగారట. అంతకుముందు రోజంతా తన ఫ్యామిలీతో గడిపారు. బుధవారం సాయంత్రం ఏడుగంటల వరకూ నార్మల్ గానే ఉన్నారంటున్నారు ఆయన సన్నిహితులు. అయితే సడెన్ గా రివాల్వర్ సౌండ్ వినిపించడంతో… సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చారు. రక్తపుమడుగులో పడి ఉన్న పర్మార్ ని జేజే హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయాడని డాక్టర్లు కన్ ఫామ్ చేశారు. కొన్నిరోజుల క్రితం తన ఆఫీసులు, ప్రాజెక్టులపై ఐటీ రైడ్స్ జరగడం… పర్మార్ ని తీవ్రంగా కలిచివేశాయని చెబుతున్నారు సన్నిహితులు. అంతేకాదు.. తాను చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు ఆనుమతులిచ్చే విషయంలో ఫడ్నవీస్ సర్కారు తీరు… ఆయన్ని ఒత్తిడిలోకి నెట్టాయంటున్నారు. కొత్త ప్రాజెక్టులకు అనుమతులు రాక.. చేపట్టిన ప్రాజెక్టుల అప్పులు తీరక.. ఆయనను డిప్రెషన్ కు గురిచేశాయంటున్నారు. ఆత్మహత్యకు ముందు 15 పేజీల సూసైడ్ నోట్ రాశారాయన. తన పర్సనల్ ల్యాప్ టాప్ నుంచి పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. సూసైడ్ నోట్ ని స్టడీ చేస్తున్న పోలీసులు… పర్మార్ ఆత్మహత్యకు గల కారణాలను విశ్లేషించేందుకు ప్రయత్నిస్తున్నారు. పర్మార్ కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy