మంచు కొండల్లో రజనీకాంత్

rajiniరాజకీయాల్లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్న సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ హిమాలయా పర్వతాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. తనకు అత్యంత సన్నిహితులతో కలిసి శనివారం(మార్చి-10) హిమాలయా పర్వతాలకు వెళ్లిన సూపర్ స్టార్ అక్కడ ప్రత్యేక పూజలు, ధ్యానం చేస్తున్నారు.

మంచుకొండల్లో ఆయనకు ఎంతో ఇష్టం అయిన బాబాజీ గుహల దగ్గరకు గుర్రం పై వెళ్లారు. రజనీకాంత్ వెంట వెళ్లిన ఆయన సన్నిహితులు గుర్రాల మీదనే బాబాజీ గుహల దగ్గరకు చేరుకున్నారు.

తెల్లటి దస్తులు వేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ కు బాబాజీ గుహల్లోని స్వామీజీలు స్వాగతం పలికారు. తర్వాత గుహల్లోని బాబాజీ విగ్రహానికి రజనీకాంత్ ప్రత్యేక పూజలు చేశారు.  ఆ గుహల్లోనే రజనీకాంత్ ఉన్నారు. అంతేకాదు ఏకాంతంగా ధ్యానం చేస్తున్నారు.  రజనీ వెంట వెళ్లిన ఆయన సన్నిహితులు వేర్వేరుగా ఏకాంతంగా ధన్యానం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy