మండలిలో రిజర్వేషన్ బిల్లుపై చర్చ

kcr-mandaliతెలంగాణ శాసన మండలిలో గిరిజన, బీసీ-ఈ రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో సామాజిక వెనుబాటుతనంతోనే రాష్ట్రంలో రిజర్వేషన్ లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త రాష్ట్రం కావడంతో పరిస్థితులు మారాయి. గిరిజనులు జనాభా పెరిగింది. కులం, మతం ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో చాలా మంది వెనకబడి ఉన్నారు. కొన్ని రాష్ట్రాలలో ఎస్టీలకు 80శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నాయి.

దక్షిణాధి రాష్ట్రం తమిళనాడులో 50 శాతం పైగా రిజర్వేషన్ లు అమలవుతున్నాయి. పక్క రాష్ట్రంలో ఇస్తున్నప్పుడు.. ఇక్కడెందుకు ఇవ్వరని అడుగుతామన్నారు. కోర్టు అనుమతివ్వదు గనక తమిళనాడు ప్రభుత్వం కేంద్రం సలహాతో 1059 యాక్ట్ 45 ద్వారా అసెంబ్లీ తీర్మానానికి రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది. రెండు దశాబ్దాలుగా ఈ కేసు పెండింగ్ లో ఉంది. తమిళనాడు అన్న పదం దగ్గర తెలంగాణ అని రాసుకొని సేమ్ చట్టాన్ని మక్కికి మక్కి కేంద్రం దగ్గరకు తీసుకొని పోతాం అన్నారు. 90శాతం ఈ దేశంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ ల జనాభా ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ లు పెంచుకోవడానికి బీసీ కమిషన్, సుధీర్, చెల్లప్ప కమిషన్ లు నివేదికలు ఇచ్చాయి. బీసీ రిజర్వేషన్ పెంచాల్సిన అవసరం కూడా ఉంది. ఇందుకోసం ఆరు నెలలోపు బీసీ కమిషన్ సమగ్ర నివేదిక తయారు చేస్తుంది. దళితులకు 1 శాతం పెంచుతాం అన్నారు.

ఇది మతపరమైన రిజర్వేషన్ కావన్నారు సీఎం. రాష్ట్రంలో పెరిగిన జనాభాకు తగ్గట్టు ఆర్థిక, సామాజిక కోణంలో ఆలోచించి. ఒరిస్సాలో ప్రధాని నరేంద్ర మోడీ.. ముస్లింలలో వెనకబడిన వాళ్లు బీసీలే అన్నారు .. బీజేపీ ఎగ్జిక్యూటివ్ పార్టీ మీట్ లో ప్రసంగించినట్టు తెలిసిందన్నారు. చట్టం దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండాలి.

ఆంధ్ర ప్రదేశ్ లో వాల్మీకి బోయలను ఎస్టీలో చేర్చారు. తెలంగాణలో ఉన్నవాళ్లను ఎస్టీలో నుంచి తీసివేసినారు. వాల్మీకి బోయ, ఖైయితీ లంబాడ, మాలేలు అతి కొద్ధి మందే ఉన్నారు. వీళ్లను ఎస్టీల్లో చేరిస్తే.. గిరిజనుల జనాభా 10 శాతానికి చేరుతుందన్నారు.

భారత దేశ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా.. చట్టాలు కేంద్రం చేతిలో ఉండటం మంచిది కాదు. రాజస్థాన్ లో గుర్జర్లు, జాట్ లు రిజర్వేషన్ కోసం ఆందోళనలు చేస్తున్నారు. గుజరాత్ లో పటేళ్లు కూడా రిజర్వేషన్ లు కావాలని కోరుతున్నారు. స్వాతంత్ర్యానంతరం 70 ఏళ్లైనా.. ఉద్యోగ, సామాజిక పరిస్థితులకనుగుణంగా రాష్ట్రాలు అమలు రిజర్వేషన్ లు అమలు చేసుకోవడనాకి సాధ్యం కాదు. రిజర్వేషన్ లు కేంద్ర పరిధిలో నుంచి రాష్ట్రాలకు ఇవ్వాలని కోరారు సీఎం కేసీఆర్.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy