మంత్రాలు చేసిందని మహిళను చంపేశారు : 9 మందికి జీవిత ఖైదు

జార్ఖండ్ : మూఢ విశ్వాసాలతో ఓ మహిళను చంపిన కేసులో.. 9 మందికి జీవితఖైదు పడింది.  తమపై మంత్రాలు చేసిందనే నెపంతో…  నిజం తెలుసు కోకుండా ఓ మహిళను కొట్టి చంపింది ఓ కుటుంబం. ఈ సంఘటన 2013- డిసెంబర్-13న జరగగా..ఇందుకు సంబంధించిన తీర్పు శనివారం వెల్లడైంది. మహిళను దారుణంగా హత్య చేసిన కేసులో ఒకే ఫ్యామిలీకి చెందిన ఆ 9 మందికి జీవిత ఖైదు పడింది. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.

2013 డిసెంబరు 13న జార్ఖండ్‌ లోని దుమ్కా జిల్లా మాచ్‌దిహలో మంత్రగత్తె అనే అనుమానంతో ఆమె ఇంట్లోకి తొమ్మిది మంది చొరబడ్డారు. తీవ్రంగా  కొట్టడంతో.. ఆమె చనిపోయింది. అడ్డుపడిన ఆమె కుటుంబసభ్యులపై కూడా దాడి చేసి.. డెడ్ బాడీని గోనె సంచిలో కుక్కి తీసుకెళ్లిపోయారు.

మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు పెట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి-2 పవన్‌కుమార్‌ తొమ్మిది మంది నిందితులకు జీవిత ఖైదు విధించారు. రూ.10వేల చొప్పున  ఫైన్ వేశారు. ఒకవేళ ఫైన్ కట్టలేకపోతే మరో ఆరు నెలలు జైల్లోనే ఉండాలని తీర్పునిచ్చారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy