మంత్రాల పేరుతో.. సొంత అన్నావదినలనే కాల్చేశారు

81491512177_625x300సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో దారుణం జరిగింది. సొంత తమ్ముళ్లే అన్నా  వదినలను కిరోసిన్ పోసి నిప్పటించారు. చేతబడులు చేస్తున్నారనే నెపంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టారు అతని సొంత తమ్ముళ్లు. దుబ్బాకలోని బీసీ కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. దయ్యం పేరుతో ఊరికి నష్టం చేస్తున్నాడనే నెపంతో అన్న సుదర్శన్, వదిన రాజేశ్వరీలను ఇంటినుంచి లాక్కెళ్లి విద్యుత్ స్తంభానికి కట్టేశారు. గ్రామస్థులు చూస్తుండగానే కిరోసిన్ పోసి నిప్పటించారు. అడ్డుకోవడానికి పోయిన కూతురు రేణుక, కొడుకు శ్రీధర్ లకు కూడా నిప్పుపెట్టేందుకు ప్రయత్నించారు చిన్నాన్నలు.

సుదర్శన్, శ్రీనివాసులు, మల్లేశం అన్నదమ్ములు. కొన్ని రోజుల క్రితం తండ్రి చనిపోయాడు. ఆయన మరణానికి కారణం పెద్దన్న సుదర్శనేనని ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండేవాళ్లు. దీనికి ఊరివాళ్లు కూడా తోడయ్యారు. అంతకు ముందు ఇదే విషయంలో పోలీసె స్టేషన్ లో గురువారం అన్నదమ్ములకు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. ఇంటికి వెళ్లిన అర్ధగంటలోనే ఈ ఘాతుకుం జరిగింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారు. సుదర్శన్, రాజేశ్వరిలపై ఇంకా మంటలు వస్తూనే ఉన్నాయన్నారు పోలీసులు. ఆర్పేందుకు గ్రామస్థులు, బంధువులు బ్లాంకెట్స్ ఇవ్వలేదన్నారు. మట్టితో మంటలు ఆర్పి హాస్పిటల్ కు తరలించామని తెలిపారు స్థానిక ఎస్సై.

ఈ ఘటనకు పోలీసుల నిర్లక్ష్యం కూడా తోడైంది అంటున్నారు కొందరు. తమ్ముళ్లు కొట్టిన రోజు సుదర్శన్ దంపతులు పీఎస్ కు వెళితే ఎస్సై లేడని పట్టించుకోలేదు. కేసును అప్పుడే సీరియస్ గా తీసుకొని ఉంటే ఈ దారుణం జరిగేది కాందటున్నారు మరికొందరు గ్రామస్థులు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy