మంత్రి అయితే రావా : రోడ్డు పక్కన మూత్ర విసర్జనపై ఆడిపోసుకున్నారు

radha mohan singh

ఆయన కేంద్రమంత్రి. అందునా  కేబినెట్ ర్యాంక్. స్వచ్ఛ్ భారత్ ను  కేరాఫ్ గా ఉన్న మోడీగారి మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రి. ఆయనే  మన రాధా మోహన్ సింగ్. మన మంత్రి గారు పబ్లిక్ లో ఓ పని చేశారు. ఎంచక్కా తన కాన్వాయిని రోడ్డుపై ఆపి..గోడ  దగ్గర మూత్రం  పోశారు మంత్రి గారి. ఈ పనికి సెక్యూరిటీ కూడా కాపలా ఉంది. బీహార్ రాష్ట్రం మోతిహరిల తిరుగుతూ.. ఇలా బహిరంగానే తన పని కానిచ్చుకోవటం.. ఆ ఫొటోలు, వీడియో మీడియాలో రావటంతో రచ్చ రచ్చ అవుతోంది.

స్వచ్ఛ్ భారత్ అంటూ ఓ వైపు దేశాన్ని ఊడ్చేస్తున్నారు ప్రధాని మోడీ. మంత్రిగారి పనికి కొద్దిసేపటి ముందే.. గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోడీ చీపురుతో  వీధులు ఊడ్చారు. కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ మాత్రం బీహార్ లో ఆరుబయటే మూత్ర విసర్జనతో తిప్పలు కొని తెచ్చుకున్నారు. ఆరుబయట మూత్ర, మల విసర్జన చేయొద్దు.. అలాచేస్తే గేలి చేయండి అంటూ పెద్ద పెద్ద యాడ్స్ కూడా టీవీల్లో ప్రసారం అవుతున్నాయి. ఇలాంటి టైంలో కేంద్రమంత్రి ఇలా చేయటం అంటే ఎవరికి నీతులు చెబుతున్నారు అంటూ సోషల్ మీడియా నిలదీయటం మొదలెట్టింది.

అధికారంలోకి  వస్తూనే స్వచ్చ్ భారత్  కోసం గల్లీల్లో ప్రోగ్రాం  పెట్టారు మోడీ.  బహిరంగ మల, మూత్ర విసర్జన వద్దని, ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టిస్తున్నారు. జనానికి కూడా స్వచ్ఛ్ భారత్  కాన్సెప్ట్  కనెక్ట్  అయింది. మంత్రిగారికి  ఎందుకో  వర్కవుట్  అయినట్లు లేదు. స్వచ్ఛ్ భారత్ మనకు కాదులే  అనుకున్నరేమో.. ఎంచక్కా గోడ దగ్గరకు పని కానిచ్చేశారు. నలుగురికీ ఆదర్శంగా ఉండాల్సిన మంత్రిగారే.. ఇలా చేస్తే ఎలా అంటూ విపక్షాలు సైతం విమర్శలు చేస్తున్నారు.

అంటే అన్నారు అంటారు.. మంత్రి అయితే రావా.. పాపం పెద్దాయన.. ఏదో అర్జెంట్ అయ్యి ఉంటుంది.. ఆ మాత్రం దానికే ఇంత పెద్ద ఎత్తున రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏంటీ అని నెటిజన్లు సైతం కొందరు పాజిటివ్ గా స్పందించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy