మంత్రి కాన్వాయ్ లో ప్రమాదం..పలువురికి గాయాలు

accidentరాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్ లోని ఒక వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పై కట్టంగూర్ మండలం యరసానిగూడెం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు మంత్రి జగదీష్ రెడ్డి వాహన శ్రేణి వెళ్తుండగా.. యరసానిగూడెం వద్ద ఒక ఇన్నోవా గ్రామం నుంచి హైవే పైకి వేగంగా దూసుకొచ్చింది. జగదీష్ రెడ్డి ప్రయాణిస్తున్న ఫార్చ్యూనర్ కంటే ముందున్న ఇన్నోవా వాహనం.. వేగంగా వచ్చిన మరో ఇన్నోవాను తప్పించబోయి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఐ20 కారుని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐ20లో ప్రయాణిస్తున్న గరిడేపల్లి మండలం గడ్డిపల్లివాసి ఆరెపూడి సత్యం, ఆయన కుమారుడు సంతన్ తో పాటు ఇన్నోవాలో ఉన్న మంత్రి వ్యక్తిగత సిబ్బంది లింగయ్య, క్రిష్ణ, అవినాష్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. యరసానిగూడెం నుంచి రోడ్ పైకి వచ్చిన ఇన్నోవాకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. క్షతగాత్రులను హుటాహుటిన నార్కట్ పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. అనంతరం మంత్రి సూర్యాపేటకు బయల్దేరి వెళ్లారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy