మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాలు : 18 డిమాండ్లు నెరవేర్చాల్సిందే

tngoఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ భేటీ  ముగిసింది. మొత్తం 18 డిమాండ్లపై మంత్రులతో చర్చించామన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. జూన్ 2 లోపు APలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రాష్ట్రానికి తీసుకురావాలని కమిటీని కోరామన్నారు నేతలు. వీలైనంత త్వరగా 11వ PRC కమిటీ వేయాలని సూచించారు. ఉద్యోగుల పదవీ విరమణ 58 ఏళ్ల నుంచి 60ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. ఎల్లుండి (ఆదివారం,మే 6) లోగా సీఎంతో చర్చించి మంత్రుల కమిటీ నిర్ణయం ప్రకటించాలన్నారు. రేపు (శనివారం,మే-5)  మరోసారి  సమావేశం కావాలని నిర్ణయించారు.

ఆర్థిక  మంత్రి ఈటల రాజేందర్‌ నేతృత్వంలో మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డిలు ఉద్యోగ సంఘాల నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో తెలంగాణ గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘంతో పాటు పలు ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ గత కొంత కాలంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్‌చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy