మందుబాబులకు బ్యాడ్ న్యూస్: పండగ తర్వాత ధరలు పెంపు

liquor-storeదసరా పండగ వెళ్లిన మరుసటి రోజే.. లిక్కర్ ధరలు పెరుగుతాయంటున్నాయి ఎక్సైజ్ వర్గాలు. అక్టోబర్‌ 1 నుంచి కొత్త ధరలు అమలులోకి రానున్నాయని చెబుతున్నారు. దీనికి ప్రభుత్వం కూడా అంగీకరించినట్టు సమాచారం. ఒక్కో బాటిల్‌పై ఎంత లేదన్నా రూ.10 వరకు పెరిగే అవకాశాలున్నట్టు వివరిస్తున్నాయి. లిక్కర్‌ ధరలు పెంచాలంటూ ఎక్సైజ్‌ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. ప్రస్తుతం ఈ ఫైలు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)లో పెండింగ్‌లో ఉంది.

గతంలో ఒక్కో ఫుల్‌ బాటిల్‌పై రూ.5 నుంచి రూ.300 వరకు రేట్లు పెరిగాయి. ఎక్సైజ్‌ కమిషనరేట్‌ స్థాయిలోనే ఈ పెంపు నిర్ణయం తీసుకున్నారు. కానీ… ఈసారి పెంపునకు ప్రధాన కారణం సప్లయర్లే. మద్యాన్ని సరఫరా చేసినందుకు తమకు చెల్లించే రేట్లను పెంచాలంటూ కొంత కాలంగా డిస్టిలరీల యాజమాన్యాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దీంతో రేట్లు కచ్చితంగా పెరగనున్నాయంటున్నాయి ఎక్సైజ్ వర్గాలు.

Leave a Reply

Your email address will not be published.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy