మందు అమ్మిన చోటే పాలమ్ముతారట

wine shopsబీహార్ సీఎం నితీశ్ కుమార్ విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే బీహార్ లో సంపూర్ణ మద్య నిషేధం ప్రకటించిన ఆయన.. ఆ షాపుల ఓనర్లకు సరికొత్త భరోసా ఇచ్చారు. మద్యం దుకాణాలను మిల్క్ బూత్ లుగా మార్చాలని డిసైడ్ అయినట్టు ప్రకటించారు నితీశ్. విడతలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామన్న ఆయన.. మొదట గ్రామాల్లో మద్య నిషేధం అమలు చేస్తామన్నారు. ఆదివారం ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు నితీశ్. అయితే ఇకపై మందుబాబులు తిరిగిన చోట పాలు కొంటారన్నమాట బీహారీలు. అనారోగ్యాలకు కారణమైన ఆ చోటే ఇప్పుడు ఆయుష్షును పెంచబోతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహిళలు.

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy